Saturday, March 13, 2010

ద్వారకాతిరుమల

 

హాయ్! హలో ! ద్వారకాతిరుమల గురించి చెపుతాను .
మా ఊరు (దొరసానిపాడు) పక్కనే కొలువై ఉన్న ద్వారకావాసుడు, శ్రీనివాసుడు, శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దైవ సన్నిదానం ద్వారకాతిరుమలలో కలదు. ద్వారకాతిరుమల ఆంధ్ర ప్రదేశ్, వెస్ట్ గోదావరి, ఏలూరు పట్టణానికి దగ్గరలో (35  కిలో మేటర్ లో ఉన్నది) ఎవరైనా సరే స్వామిని దర్సించాలంటే బై ట్రైన్ రావచ్చు బై బస్సు రావచ్చు. ఏలూరు నుండి మీరు బస్సు లో వస్తుంటే మీకు చల్లటి ఆహ్లాదాన్ని అందించే వరి పంట పొలాలు, చల్లని చెట్లు రోడ్డు ఇరువైపులా దర్సనమిస్తాఇ, మీరు ద్వారకాతిరుమల వెళ్ళే లోపు మీరు శ్రీ జగన్నాధ స్వామిని దర్శించ వచ్చు, కుంకుళ్ళమ్మ వారిని దర్శించవచ్చు . అసలు శ్రీ వేంకటేశ్వరుడు మా ఊరి లోనే (దొరసానిపాడులో) పుట్టి పెరిగి మా తాత తాత తాత ల తో ఆదుకున్నాడని మా ఊరి వారికీ నమ్మకం. అందుకే ప్రతి సంక్రాంతికి మా ఊరు (స్వామి వారి ఊరు) వచ్చి ఊరంతా తిరిగి తిరిగి ( ఊరేగింపుగా) వెళతాడు స్వామి.
                                        
సరే సరే అది వేరే సంగతి. భక్తులు స్వామివారిని దర్శించి న తరువాత దగ్గరలో శ్రీ కైలాసనాధుడు, మహా శివుడు, హర హర మహా దేవుడు కులువై ఉన్నాడు, (ఇక్కడ శివాలయం నుండి చూస్తె మా ఊరు కనబడుతుంది) ఈయనను దర్సించినచో సర్వ పాపాలు పోతాయట.  






అంతే కాదండో ద్వారకాతిరుమల దగ్గరలోనే శ్రీ శ్రీ సీతా రాముల దేవాలయం కూడా ఉన్నది. బక్తులు ద్వారకాతిరుమల నుండి బయలు దేరి మా ఊరి నుండి సరిగ్గా ౩ కిలోమీటర్ లో (ఈస్ట్ ఎడవల్లి లో )ఉన్నది రామాలయం



అక్కడ స్వామిని దర్శించి తీర్ధ ప్రసాదాలు తీసుకుని ఓపిక ఉంటె మల్లి భయలు దేరి దగ్గరలో మరో దేవాలయం ఇంచు మించు 20 కిలోమీటర్ స్ ఉంటుంది అదే శ్రీ శ్రీ మద్ది ఆంజనేయ స్వామీ వారి దేవాలయం కరుణ కటాక్షం ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి (కార్తిక మాసంలో ఈ స్వామిని కొలవని భక్తుడు ఉండడంటే నమ్మండి). ఎలా మీరు (భక్తులు ప్లాన్ చేసుకోవచ్చు) అన్ని దేవాలయాలు చూడవచ్చు ఒక రోజులోనే తిరిగి మల్లి మీ మీ గమ్య స్తానాలు చేరవచ్చు ఇక ఆలస్యం ఎందుకు ప్లాన్ చేసుకోండి.

No comments:

Post a Comment