Friday, March 26, 2010

ఆ రాత్రి

అది  3rd మార్చ్ 1999 కాలేజ్ అయుపోయేరోజుల్లో మేము కాలేజీ పిక్నిక్ సరదాగా అడవిలో  పెట్టుకుందామని బయలు దేరాము అడవికి . కాలేజ్ మొత్తం ఒకటైతే మేము (నేను, ఖాన్, రవి, శేకర్, సుబ్బు,అనిత, రాధిక & మాధవి ఒకటి) మాది వేరే ప్రపంచం, మా అలవాట్లు, అభిరుచులు వేరే, అందుకే కాలేజ్ మాతో కలవదు, మేముకూడా వేరే వాళ్ళతో కలవమూ,మేమంతా పిక్నిక్ కి కాలజ్ తో కలసి అడవికి వెళ్ళినా, మేము మాత్రం సెపరేట్ గా పిక్నిక్ జరుపుకోవడానికి కాలేజ్ స్టూడెంట్స్ కి దూరంగా 1km వెళ్ళాము అడవిలోనికి అక్కడ చాలా బావుంది, రక రకాల పక్షుల కిల కిల రావాలు, సెలయేర్లు, జెలపాతాలు, రంగు రంగుల పూల చెట్లు, ఆకాశానంటే పెద్ద పెద్ద వృక్షాలున్నాయి.మేము ఆరోజంతా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం, ఎన్నో ఫొటోస్ దిగాం, జలకాలాడం, ఆదుకున్నాం, పాడుకున్నాం ఇలా ఎన్నో ఎన్నెన్నో. అలా ఆడుతూ పాడుతూనే ఉండగానే చీకటి పడిపోయింది. అరే తొందరగా బయలుదేరి కాలేజ్ బస్సు చేరుకోవాలి అని తొందరగా ఎవరికి వారే బాగ్స్ సర్దుకొని బయలుదేరే లోపే చీకటి కమ్మేసింది, దారికనపడని, దిక్కుతోచని పరిస్తితి మాది. అప్పుడు మాకు దూరంగా ఎక్కడో ఒక చిన్న కాంతి కనబడుతుంది. ఇక మేమంతా ఒక్క క్సణం ఆలోచించకుండా త్వరత్వరగా, వేగంగా ఆ కాంతి ఉన్నచోటికి బయలు దేరాము.మేము వెళుతూనే ఉన్నాం, వెళుతూనే ఉన్నాం ఆకాంతి కూడా వెళుతూనే ఉంది. అప్పుడు మేము అరే అది ఎవరో మనిషిరా తొందరగా పరుగు పెట్టండి అని కేకలు పెడుతూ, ఆగండి ఆగండి అంటూ ఆ కాంతి వెంట పరుగులు తీసాం.అలా వెళ్లి వెళ్లి ఎక్కడికి వేలుతున్నామో, ఎంత దూరం వెళ్ళామో మాకే తెలియదు.అప్పుడు మాలో ఒకడు అరే ఉండండిరా ఆ కాంతి మనిషే అయితే మన కేకలకు పలికేవాడే. అది మనిషి కాదు ఇంకెవరో అని మాలో లేని పోనీ భయం రేపాడు. ఇక చూడండి ప్రోద్దిట రక రకాల పక్షుల కిల కిల రావాలు,కోయల పాటలు విన్న మేము ఇప్పుడేమో కిరు కిరు సెభ్దాలు, వింత సౌండ్లు వింటూ ఒకరికి ఒకరు తోడుగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు పోతు ఉంటే ఆ కాంతి కాస్త వేణు తిరిగి మాకు ఎదురుగా వస్తుంది.అప్పుడు మా పరిస్థితి చూడాలి అందరం ఒకరిమొకం మరొకరు చూసుకుంటుంటే ఇంతలో మాలో ఒకడు (రవిగాడు) అరే అది మనిషికాడుర, నేను ఊహించినట్లు అది దెయ్యమే అనేసాడు. ఆడపిల్లలు ఒక్కసారిగా బిగ్గరగా అరిసేసారు. ఇంతలో ఆ కాంతి వేగంగా వస్తుంది,ప్రక్కన కిరు కిరు సౌండ్స్ ఏమి అర్ధం కావడం లేదు రావిగాడైతే కళ్ళు మూసేసుకున్నాడు. ఆడ పిల్లలైతే నా దగ్గరకొచ్చి గట్టిగ నన్ను పట్టేసుకున్నారు, ఖానుగాడు మాత్రం ఆ కాన్తినే చూస్తుండిపోయాడు.(వాడికి దైర్యం కాస్త ఎక్కువే) ఆ కాంతి ఒక్కసారిగా ఒక 20 అడుగుల దూరంలో ఆగిపోయింది. ఖాన్ గాడు ఎవరది, ఎవరది అని అరవసాగాడు. అటునుండి ఏమాత్రం సమాధానం లేదు. మళ్లీ ఖాన్ ఒరేయ్! ఎవర్రా  అది 4 గంటలనుండి ఏడిపిస్తున్నావ్ దమ్ముంటే ముందుకురార! తాడో పేడో తేల్చుకుందాం అనే సరికి మళ్లీ ఆ కాంతి దగ్గరగా వస్తుంది ఖాన్ గాడు పెద్దకర్రే పట్టుకున్నాడు ఏమైనా సరే, ఎవరైనా సరే కొట్టేద్దామని(మరి లేక పోతే ఏమిటండి 4 గంటలనుండి ఆ కాంతి మమ్మల్ని ఏడిపిస్తుంది ఎవరికి రాదు కోపం) రెడీ గా ఉన్నాడు. ఇంతలో ఆ కాంతి మా మీదకు రానే వచ్చింది ఒక్కసారిగా అందరం కళ్ళు మూసుకున్నాం ఒక్క ఖాన్ గాడు తప్పించి. అంతా సైలెంట్ ఓ 5 నిమిషాల తరువాత చిన్నగా నవ్వు , ఆ తరువాత బిగ్గరగా నవ్వు అది కచ్చితంగా ఖాన్ గాడిదే అని నిర్ణయించుకొని అందరం కళ్ళు తెరిచేసరికి ఖాన్ గాడు ఆ కాంతిని చేత్తో పట్టుకుని నవ్వుతూ ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా అందరిలో ఆనందం, నవ్వులు విరిసాయ్. అరే బాప్రే ఎంత బయపడ్డం, ఈ తూనీగను చూసి , సరే ముందుకు పదండి ఈ దగ్గరలో ఏదైనా ఈ రాత్రికి సేల్టర్ దొరుకుతుందేమో చూద్దాం, ఈ రాత్రి జర్నీ చేయడం కష్టమే ఇదిగో ఇలాగే ఏదో ఒకటి చూసి బయపడతాం అందుకే దగ్గరలో ఏదైనా సేల్టర్ చూసుకుని ఉంది, ఉదయం అవ్వగాని మనం సేఫ్ గా వెళ్ళొచ్చు ఏమంటారు అన్నాడు ఖాన్ గాడు. ఇంతలో రవిగాడు కల్పించుకొని మనమంతా పడుకొని ఉంటే ఎవరో ఒకరు, ఏదో ఒకటి మనల్ని ఎత్తుకేల్లడమో, చంపడమో చేస్తే ఎలా? ఒరేయ్ నీకన్నీ ఎదవ ఆలోచనలే నోరుమూసుకుని రారా అన్నాను. కాని వాడు చెప్పిందాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఖాన్ గాడు ఇంతలో కల్పించుకొని సరేరా అందరం పడుకుంటే ప్రాబ్లం కదా, ఒక పని చేద్దాం తలా ఒకరొకరు చొప్పున రెండేసి గంటలు కాపలా ఉందాం అని చెప్పే లోపల దూరంగా ఏదో చప్పుడు మెల్లగా ఆ చప్పుడు వైపు వెల్ల సాగం అందరం. అక్కడ గోరాతి గోరమైన ఒక వింత కళ్ళార చూసాం, ఆ గోరాన్ని చూడ లేక మా ఫ్రెండ్స్ లో ఇద్దరు కళ్ళుకూడా మూసుకున్నారు. ఆ బయంకర గోరాన్ని మీము తెచ్చుకున్న వీడియోలో పక్కగా తీసాం.ఇంతలో వాళ్ళల్లో ఒకడు మమ్మల్ని చూసేసాడు వాళ్ళంతా కలసి మమ్మల్ని వేమ్భాడించడం మొదలు పెట్టారు ఎలాగైతేనే ఆ అడవినుండి వాళ్ళ నుండి బయట పడి సిటీ కి వచ్చేసాం.ఒక రోజూ రెస్ట్ తీసుకుని ఆ మర్నాడు ఆ వీడియో  తీసుకుని పోలీసు కమీషనేర్ ని కలసి జరిగిందంతా చెప్పి ఆ వీడియో చూపించి 

Saturday, March 20, 2010

ఇగో

హాయ్! మనకి ఈప్రపంచంలో మనం బ్రతకడానికి చాలా అవకాశాలు, ఆలోచనలు ఉన్నాయి. ప్రతీ మనిషి కస్టపడి,కృషి చేస్తే తప్పకుండా ఫలితం కనబడుతుంది, అంతే కాని ఆ! ఏమి చేస్తాం లే, ఆ! చేస్తే ఫలితం వస్తుందా అని ఆలోచించడం తప్పు. కృషి చేయండి ఫలితం దానంతట అదే వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆనందం వచ్చినప్పుడు గంతులు వేయకూడదు, దు:ఖం వచ్చినప్పుడు భాద పడకూడదు ఇవి రెండూ సమానంగా అనుభవించి నపుడే జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. కాని ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుంది అంతా రివర్సు జరుగుతుంది. ఎలా అంటే మన పక్కోడు బావుండకూడదు మనమే భావుండాలి, పక్కోడు ఎప్పుడూ మనమీదే ఆధారపడాలి అని ఆలోచిస్తాం, అంతే కాకుండా వ్యవసాయంలో కాని, బిజినెస్ లో కాని,ఉద్యోగంలో కాని ఎవరైనా ముందు కేలుతుంటే (అభివృద్ధి సాదిస్తుంటే) మనం ఇగో ఫీలవుతాం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి అభివృద్ధి సాదించారు, అలాగే మనం కూడా కస్టపడి వాళ్ళలాగా, కాదు కాదు వాళ్ళకంటే ఎక్కువగా కస్టపడి అభివృద్ధి సాధించాలి అని అనుకోవాలి తప్పా ఇగో ఫీలవకూడదు. సహజంగా మీకు మీరే ఒక సారి ఆత్మపరిశీలనా చేసుకోండి విషయమేమిటో మీకే తెలుస్తుంది. చాలా మంది తామే తప్పు చేసి నాది తప్పేమీ లేదు వాళ్ళదే, అతనిదే తప్పు అని పదే పదే  ఏలెత్తి  వాదిస్తుంటారు. కాని అతనికి తెలెయదు అతని చూపుడు వ్రేలు ఒక్కటే  ఎదుటవాని తప్పు  చూపిస్తుంటే, అతని మూడు వ్రేళ్ళు మాత్రం తనే తప్పు చేసినట్లు చూపిస్తుంటాయ్. ఈ నిజం మీరు అంగీకరించగలరా?ఎదుట వారిని తప్పు పట్టేటప్పుడు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి, లేదంటే మనకి ---------కి  తేడ లేదు.ఇది నమ్మి ఆచరించి, అంగీక రించినవాడు నిజంగా మనిషే.    
మీ అమూల్యమైన సలహాలు అందిస్తారని కోరుతూ మీ శ్రీనివాస్.

Thursday, March 18, 2010

వీళ్ళను ఏమిచేద్దాం

హాయ్, మీరెప్పుడైనా గమనించారా, అయ్యోపాపం అని ఎప్పుడైనా అనిపించిందా? మనకి ఈ ప్రపంచంలో దేవుడు అనేక రకాలైన మనుషులను, వేరు వేరు ప్రాంతాలను, వేరు వేరు కులాలను, వేరు వేరు భాషలను ఇలా ఎన్నో రకాలుగా సృష్టించాడు. కాని ప్రతీ మనిషిలో మానవత్వాన్ని సృష్టించడం మరిచిపోయాడు. 
ఉదాహరణకు:- మనం ప్రతీ రోజూ టివీల్లో చూస్తూనే ఉంటాం. మీరు గమనించారో లేదో రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే ఈ న్యూస్ రిపోర్టర్లు ఉన్నది లేనిది కల్పించి టీవిల్లో చూపించడం పరిపాటైపోయింది. అంతేకాదు ఎవరైనా చిన్నపిల్లోడు కాని, పాప కాని కిడ్నాపైన లేదా బోరు బావిలో పడినా ఉన్నది లేనిది కల్పించి వాళ్ళనూ వారి కుటుంభాన్ని క్సోభపెట్టి, నిమిషానికి నిమిషానికి గ్యాప్ లేకుండా ఏడిపించి, వేధించి వాళ్ళను కాపాడటం పక్కనపెట్టి ఇలా అంటుంటారు. ఎలా అంటే చూడు రమ్యా ఇప్పుడు అక్కడ పరిస్తితి ఎలా ఉన్నది, ఎవరైనా సాయ పడుతున్నార, బాలున్ని బోరు బావిలోంచి తీయడానికి ఎంత మంది ప్రభుత్వ సిబ్బంది వచ్చింది, అసలు బాలున్ని తీయడం జరుగుతుందా, బాలుడు బోరులో పడి అప్పుడే రెండు గంటలు దాటిపోయింది ఇప్పటి వరకూ బాలుడు ఎలా ఉన్నది లేనిది తెలియడం లేదు అసలు ఇంత వరకు పోలీసులు కాని, ప్రభుత్వ సిబ్బంది కాని వచ్చారా రమ్యా? బోరు బావిలో పడిన బాలుని గురించి తెలుసుకొనే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తరువాత బోరు బావిలో పడిన బాలుని గురించి చర్చ కొనసాగుతుంది. ఈ విషయాన్ని మొట్టమొదట కనుక్కొని మీకు అందిస్తుంది మా Z ఛానల్. అలా ప్రతీ విషయాన్ని చూపించి వాళ్ళంతా సొమ్ము చేసుకుంటున్నారు

Saturday, March 13, 2010

కృషి/పట్టుదల

హాయ్! హలో
ఒక మనిషికి  ఉండాల్సింది కృషి,పట్టుదల, జీవితంలో పైకి రావాలనే అకాంక్స ఉండాలే తప్పా బద్ధకం, ఎవరో వస్తారు, ఏదో తెస్తారు, కూర్చుని సంపాదించాలి, పడుకుని సంపాదించాలి అని ఆలోచించకూడదు. ప్రతి ఆలోచన మనల్ని మనం మార్చుకునేటట్టు ఉండాలి, జీవితం ఒక చాలంజ్ గా తీసుకోవాలి అంతే కాని పిరికి వానిగా, బద్దకస్తునిగా, ఒంటరిగా , ఈ ప్రపంచముతో సంభందం లేకుండా ఉండకూడదు.
మీకో చిన్న కధ చెబుతాను.
ఎవరో ఒకతను పేపర్లో యాడ్ ఇచ్చాడు, ఏమనంటే డబ్బు సంపాదించడం ఎలా? మీరు గనుక ఈజీగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? ఇంట్లో వుండే డబ్బు సంపదిన్చాలను కుంటున్నార ? ఐయితే మీరు ఈ క్రింది అడ్రెస్స్ కి 50 రూపాయలు మని యార్డర్ చేయండి (మిస్టర్ ఎస్ కే ఖాన్, 7 - 1 -345 , మినిస్టర్ రోడ్, చెన్నై-07 .) మీకు ఒక అద్భుతమైన పుస్తకం పంపిస్తాము. ఆ పుస్తకంలో మీరు తొందరగా లక్షాది కారి ఎలా అవ్వాలో, తొందరగా డబ్బు ఎలా సంపాదించాలో ఏవిదంగా సంపాదించాలో వివరంగా రాసి ఉంటుంది. అని కేవలం 200  రూపాయలతో వెరి స్మాల్ యాడ్ (ప్రకటన) న్యూస్ పేపర్లో ఇచ్చాడండి.అతని కర్చు కేవలం 200 రూపాయలు మాత్రమే. అది చూసి ఈ పిచ్చి జనం, అమాయక జనం, బద్దకస్తు జనం,మోసపూరిత , అయోమయపు జనం మాత్రం 50 రూపాయలు, 50 రూపాయలు చొప్పున కొన్ని లక్షల్లొ వాడికి డబ్బు పంపారండి.వాడేమో ఒక్క దెబ్బతో లక్షాదికారై పోయాడు. ఈ డబ్బు పంపిన వారికి రిప్లై లేదు, మళ్లీ పేపర్లో యాడ్ లేదు, వీళ్ళంతా వాడి పేపర్ యాడ్ కోసం, వాడు పంపే బుక్ కోసం చూసి చూసి మరచి పోయారు.( దీని వలన తెలిసింది ఏమిటయ్య అంటే, వాడి మాటల్లోనే పిచ్చివాల్లారా నేను ఈమాత్రామన్న చేసి డబ్బు సంపాదిస్తున్నాను. మీ లాగ కూర్చుని సోమరిగా తింటూ ఉండలేదు. కాబట్టి మీరు కూడా ఏదో ఒకటి చేయండి కాలిగా ఉండక అన్నాడు ) మీ అమూల్యమైన సందేశాలు పంపమని కోరుకుంటూ మీ శ్రీనివాస్.

ద్వారకాతిరుమల

 

హాయ్! హలో ! ద్వారకాతిరుమల గురించి చెపుతాను .
మా ఊరు (దొరసానిపాడు) పక్కనే కొలువై ఉన్న ద్వారకావాసుడు, శ్రీనివాసుడు, శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దైవ సన్నిదానం ద్వారకాతిరుమలలో కలదు. ద్వారకాతిరుమల ఆంధ్ర ప్రదేశ్, వెస్ట్ గోదావరి, ఏలూరు పట్టణానికి దగ్గరలో (35  కిలో మేటర్ లో ఉన్నది) ఎవరైనా సరే స్వామిని దర్సించాలంటే బై ట్రైన్ రావచ్చు బై బస్సు రావచ్చు. ఏలూరు నుండి మీరు బస్సు లో వస్తుంటే మీకు చల్లటి ఆహ్లాదాన్ని అందించే వరి పంట పొలాలు, చల్లని చెట్లు రోడ్డు ఇరువైపులా దర్సనమిస్తాఇ, మీరు ద్వారకాతిరుమల వెళ్ళే లోపు మీరు శ్రీ జగన్నాధ స్వామిని దర్శించ వచ్చు, కుంకుళ్ళమ్మ వారిని దర్శించవచ్చు . అసలు శ్రీ వేంకటేశ్వరుడు మా ఊరి లోనే (దొరసానిపాడులో) పుట్టి పెరిగి మా తాత తాత తాత ల తో ఆదుకున్నాడని మా ఊరి వారికీ నమ్మకం. అందుకే ప్రతి సంక్రాంతికి మా ఊరు (స్వామి వారి ఊరు) వచ్చి ఊరంతా తిరిగి తిరిగి ( ఊరేగింపుగా) వెళతాడు స్వామి.
                                        
సరే సరే అది వేరే సంగతి. భక్తులు స్వామివారిని దర్శించి న తరువాత దగ్గరలో శ్రీ కైలాసనాధుడు, మహా శివుడు, హర హర మహా దేవుడు కులువై ఉన్నాడు, (ఇక్కడ శివాలయం నుండి చూస్తె మా ఊరు కనబడుతుంది) ఈయనను దర్సించినచో సర్వ పాపాలు పోతాయట.  






అంతే కాదండో ద్వారకాతిరుమల దగ్గరలోనే శ్రీ శ్రీ సీతా రాముల దేవాలయం కూడా ఉన్నది. బక్తులు ద్వారకాతిరుమల నుండి బయలు దేరి మా ఊరి నుండి సరిగ్గా ౩ కిలోమీటర్ లో (ఈస్ట్ ఎడవల్లి లో )ఉన్నది రామాలయం



అక్కడ స్వామిని దర్శించి తీర్ధ ప్రసాదాలు తీసుకుని ఓపిక ఉంటె మల్లి భయలు దేరి దగ్గరలో మరో దేవాలయం ఇంచు మించు 20 కిలోమీటర్ స్ ఉంటుంది అదే శ్రీ శ్రీ మద్ది ఆంజనేయ స్వామీ వారి దేవాలయం కరుణ కటాక్షం ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి (కార్తిక మాసంలో ఈ స్వామిని కొలవని భక్తుడు ఉండడంటే నమ్మండి). ఎలా మీరు (భక్తులు ప్లాన్ చేసుకోవచ్చు) అన్ని దేవాలయాలు చూడవచ్చు ఒక రోజులోనే తిరిగి మల్లి మీ మీ గమ్య స్తానాలు చేరవచ్చు ఇక ఆలస్యం ఎందుకు ప్లాన్ చేసుకోండి.