Saturday, March 20, 2010

ఇగో

హాయ్! మనకి ఈప్రపంచంలో మనం బ్రతకడానికి చాలా అవకాశాలు, ఆలోచనలు ఉన్నాయి. ప్రతీ మనిషి కస్టపడి,కృషి చేస్తే తప్పకుండా ఫలితం కనబడుతుంది, అంతే కాని ఆ! ఏమి చేస్తాం లే, ఆ! చేస్తే ఫలితం వస్తుందా అని ఆలోచించడం తప్పు. కృషి చేయండి ఫలితం దానంతట అదే వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆనందం వచ్చినప్పుడు గంతులు వేయకూడదు, దు:ఖం వచ్చినప్పుడు భాద పడకూడదు ఇవి రెండూ సమానంగా అనుభవించి నపుడే జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. కాని ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుంది అంతా రివర్సు జరుగుతుంది. ఎలా అంటే మన పక్కోడు బావుండకూడదు మనమే భావుండాలి, పక్కోడు ఎప్పుడూ మనమీదే ఆధారపడాలి అని ఆలోచిస్తాం, అంతే కాకుండా వ్యవసాయంలో కాని, బిజినెస్ లో కాని,ఉద్యోగంలో కాని ఎవరైనా ముందు కేలుతుంటే (అభివృద్ధి సాదిస్తుంటే) మనం ఇగో ఫీలవుతాం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి అభివృద్ధి సాదించారు, అలాగే మనం కూడా కస్టపడి వాళ్ళలాగా, కాదు కాదు వాళ్ళకంటే ఎక్కువగా కస్టపడి అభివృద్ధి సాధించాలి అని అనుకోవాలి తప్పా ఇగో ఫీలవకూడదు. సహజంగా మీకు మీరే ఒక సారి ఆత్మపరిశీలనా చేసుకోండి విషయమేమిటో మీకే తెలుస్తుంది. చాలా మంది తామే తప్పు చేసి నాది తప్పేమీ లేదు వాళ్ళదే, అతనిదే తప్పు అని పదే పదే  ఏలెత్తి  వాదిస్తుంటారు. కాని అతనికి తెలెయదు అతని చూపుడు వ్రేలు ఒక్కటే  ఎదుటవాని తప్పు  చూపిస్తుంటే, అతని మూడు వ్రేళ్ళు మాత్రం తనే తప్పు చేసినట్లు చూపిస్తుంటాయ్. ఈ నిజం మీరు అంగీకరించగలరా?ఎదుట వారిని తప్పు పట్టేటప్పుడు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి, లేదంటే మనకి ---------కి  తేడ లేదు.ఇది నమ్మి ఆచరించి, అంగీక రించినవాడు నిజంగా మనిషే.    
మీ అమూల్యమైన సలహాలు అందిస్తారని కోరుతూ మీ శ్రీనివాస్.

No comments:

Post a Comment