Thursday, March 18, 2010

వీళ్ళను ఏమిచేద్దాం

హాయ్, మీరెప్పుడైనా గమనించారా, అయ్యోపాపం అని ఎప్పుడైనా అనిపించిందా? మనకి ఈ ప్రపంచంలో దేవుడు అనేక రకాలైన మనుషులను, వేరు వేరు ప్రాంతాలను, వేరు వేరు కులాలను, వేరు వేరు భాషలను ఇలా ఎన్నో రకాలుగా సృష్టించాడు. కాని ప్రతీ మనిషిలో మానవత్వాన్ని సృష్టించడం మరిచిపోయాడు. 
ఉదాహరణకు:- మనం ప్రతీ రోజూ టివీల్లో చూస్తూనే ఉంటాం. మీరు గమనించారో లేదో రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే ఈ న్యూస్ రిపోర్టర్లు ఉన్నది లేనిది కల్పించి టీవిల్లో చూపించడం పరిపాటైపోయింది. అంతేకాదు ఎవరైనా చిన్నపిల్లోడు కాని, పాప కాని కిడ్నాపైన లేదా బోరు బావిలో పడినా ఉన్నది లేనిది కల్పించి వాళ్ళనూ వారి కుటుంభాన్ని క్సోభపెట్టి, నిమిషానికి నిమిషానికి గ్యాప్ లేకుండా ఏడిపించి, వేధించి వాళ్ళను కాపాడటం పక్కనపెట్టి ఇలా అంటుంటారు. ఎలా అంటే చూడు రమ్యా ఇప్పుడు అక్కడ పరిస్తితి ఎలా ఉన్నది, ఎవరైనా సాయ పడుతున్నార, బాలున్ని బోరు బావిలోంచి తీయడానికి ఎంత మంది ప్రభుత్వ సిబ్బంది వచ్చింది, అసలు బాలున్ని తీయడం జరుగుతుందా, బాలుడు బోరులో పడి అప్పుడే రెండు గంటలు దాటిపోయింది ఇప్పటి వరకూ బాలుడు ఎలా ఉన్నది లేనిది తెలియడం లేదు అసలు ఇంత వరకు పోలీసులు కాని, ప్రభుత్వ సిబ్బంది కాని వచ్చారా రమ్యా? బోరు బావిలో పడిన బాలుని గురించి తెలుసుకొనే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తరువాత బోరు బావిలో పడిన బాలుని గురించి చర్చ కొనసాగుతుంది. ఈ విషయాన్ని మొట్టమొదట కనుక్కొని మీకు అందిస్తుంది మా Z ఛానల్. అలా ప్రతీ విషయాన్ని చూపించి వాళ్ళంతా సొమ్ము చేసుకుంటున్నారు

1 comment:

  1. ఇది మాత్రం నిజం. సినిమాలకు సెన్సార్ ఉన్నట్టు టి.వి. లకి కూడా సెన్సార్ చేయడానికి ప్రభుత్వం అలోచించాలి. మొన్న ఒక ఛానల్ చూస్తుంటే నిత్యానందస్వామి కామలీలలు గురుంచి అప్డేటెడ్ న్యూస్ చూపిస్తూ పక్కన కామలీలలు చుపిస్తూ బాక్ గ్రౌండ్ మ్యూజిక్ (నీలి చిత్రాలలోని మ్యూజిక్) వస్తుంది. అది జరిగి పదిహేను రోజులు అయింది, అయినా దాని గురుంచి ఏదైన చెపేటప్పుడు పక్కన ఈ కామలీలలు చుపించడం అవసరమా..?

    ReplyDelete